You are currently viewing భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైనది – ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైనది – ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్

  • Post published:26/11/2021
  • Post category:News

నంద్యాల (పల్లెవెలుగు) 26 నవంబర్: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైనదని ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ నంద్యాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మౌలానా అబ్దుల్ రెహమాన్ రషాది, జీఎం గౌస్ లు పేర్కొన్నారు. నంద్యాల పట్టణం ఎన్జీఓ కాలనీలోని అల్ ఇండియా మిల్లి కౌన్సిల్, నంద్యాల డివిజన్ ఆద్వర్యంలో శుక్రవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాష, కోశాధికారి అబ్దుల్ మజీద్, కార్యవర్గ సభ్యులు కే.ఎ.ఖాన్, జావిద్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నవంబర్ 26న మన దేశం లో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, 1949 నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగాన్ని దత్తత చేసుకుందని, ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్, షెడ్యూల్స్ లోని అంశాలను స్పూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధి, పురోగతి కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు. రెండు సంవత్సరాల 11 నెలల పాటు కష్టపడి భవిష్యత్ తరాలకు రాజ్యాంగం ద్వారా దశ దిశ నిర్దేశించిన మహానుభావులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, కుల, మత, జాతీ, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగం లక్ష్యమన్నారు.