You are currently viewing సివిల్స్ పరిక్షల ఉచిత శిక్షణ కొరకో అర్హత పరీక్షా

సివిల్స్ పరిక్షల ఉచిత శిక్షణ కొరకో అర్హత పరీక్షా

  • Post published:03/12/2021
  • Post category:News

సివిల్స్ పరిక్షల ఉచిత శిక్షణ కొరకో అర్హత పరీక్షా

నంద్యాల (పల్లెవెలుగు) 03 డిసెంబర్: స్థానిక అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ కార్యాలయం లో శుక్రవారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ నంద్యాల డివిజన్ ప్రధాన కార్యదర్శి జి.యం. గౌసే, ఉపాధ్యక్షులు ఉస్మాన్, కార్యవర్గ సభ్యులు జవిద్, కే.ఏ. ఖాన్, అసదుల్లా లు పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ సివిల్ పరిక్షలకు అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్, ఫెల్కన్ గ్రూప్ అఫ్ ఇనిస్టిట్యుట్ సంయుక్త ఆధ్వర్యం లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆదివారం ఈ నెల 5 దవ తేదిన దారుల్ ఉలూమ్ సిరాత్ –ఎ- ముస్తకిం, వెంకయ పల్లి బస్ స్టాప్, నందికోట్కుర్ రోడ్, కర్నూలు నందు అర్హత పరీక్షా నిర్వహించ నున్నట్లు వెల్లడించారు. ఉత్తిర్ణులైన వారికి ఉచితంగా శిక్షణ, భోజన వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తి  గల విద్యార్థులు www.falconinstitutions.org,  aimc.nandyalonline.com,  లో పూర్తీ వివరాలు తెలుసు కొని రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. అలాగే నవంబర్ 21 న నిర్వహించిన NEET/IIT/JEE అర్హత పరిక్షలలో నంద్యాల విద్యార్థిని పరీక్షా రాసి సీట్ సంపాదించిందని హర్షం వ్యక్తం చేసారు.